Home Page SliderNational

కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగ రిజర్వేషన్లు..సిద్దరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అతని మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కన్నడిగులకు, స్థానికులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో కూడా కల్పించే అవకాశాలున్నాయి. మేనేజ్‌మెంట్ స్థాయిలో 50శాతం, ఇతర ఉద్యోగాలలో 75శాతం వరకూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నియమం పెట్టనున్నారు. కర్ణాటకలో జన్మించి, 15 ఏళ్లుగా అక్కడే ఉన్న వాళ్లు దీనికి అర్హులు. దీనితో పాటు కన్నడ భాష రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. వీరిని స్థానికులుగా పరిగణిస్తారు. పరిశ్రమలు, ఇతర సంస్థలలో వీటిని అమలు చేస్తారు.