Home Page SliderNational

ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేసిన మెటా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై మెటా కంపెనీ ఆంక్షలు ఎత్తివేసింది. కాగా 2021లో క్యాపిటల్ భవనంపై  దాడి తర్వాత మెటా కంపెనీ ట్రంప్ ఫేస్‌బుక్,ఇన్‌స్టా,X,యూట్యూబ్ వంటి పలు సోషల్ మీడియా అకౌంట్లపై నిషేదం విధించి వాటిని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ నాయకుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడం తమ బాధ్యతని ,అందుకే ఎన్నికల వేళ ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నామని పేర్కొంది. కాగా అధ్యక్ష బరిలో ఉన్న  అభ్యర్థులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయొద్దని మెటా సూచించింది.