ముగిసిన కురియన్ కమిటీ విచారణ
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కమిటీ కోసం ఎఐసీసీ నియమించిన కురియన్ కమిటీ.. తన విచారణను ముగించింది. నేతలు కురియన్, రఖిబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్‌తో కూడిన త్రిసభ్య కమిటీ.. గురు, శుక్రవారాల్లో గాంధీభవన్ వేదికగా 16 మంది లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల నుండి అభిప్రాయాలను స్వీకరించింది. ఈ నెల 21న ఎఐసీసీ కి ఓ నివేదికను అందజేయనుంది.

