మరోసారి ఆకాశాన్నంటిన బంగారం ధరలు
జాతీయ మార్కెట్‌లో కొన్ని రోజులు నుంచి బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650/- పెరిగి రూ.67,000/-కు చేరింది. కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710/- పెరగడంతో రూ.73,090/- పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా రూ.1500/- పెరిగి రూ.97,500/-కు చేరింది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.