Home Page SliderNational

తమిళనాడులో కొలిక్కి వస్తున్న తమిళిసై, అన్నామలై పంచాయతీ

లోక్ సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో తమిళిసై, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై మధ్య విభేదాలు పరిష్కారమైనట్టుగానే కన్పిస్తున్నాయ్. తమిళనాడులో బీజేపీ జెండా ఎగురేయాలని కృతనిశ్చయతం గత ఐదేళ్లుగా శ్రమిస్తున్న అన్నామలై ఈసారి ఆ పార్టీకి తమిళనాడులో మంచి ఊపు తీసుకొచ్చారు. ఆ పార్టీ ఎన్నికల్లో గెలవకపోయినప్పటికీ సుమారుగా 48 లక్షల ఓట్లను రాబట్టింది. కాంగ్రెస్ పార్టీ పొత్తుతో సాధించిన ఓట్ల కంటే 2 లక్షల ఓట్లను అధికంగా తెచ్చుకొంది. అయితే అక్కడ బీజేపీలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని దెబ్బతీశాయన్న విమర్శ ఉంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి పోటీ చేసి ఓటమి పాలవగా, అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా ఇందుకు సంబంధించి గొడవలొద్దు, ఇద్దరూ కలిసి పనిచేసుకోండన్న సందేశమిచ్చినట్టుగా కూడా వార్తలొచ్చాయ్. అయితే ఆమెకు వార్నింగ్ ఇవ్వడంపై తమిళనాడు అంతటా నిరసలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇద్దరు నేతలు ఒకరిని ఒకరు కలుసుకోవడంతో విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈరోజు, బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరు అక్క తమిళిసై సౌందరరాజన్ ను ఆమె నివాసంలో కలవడంతో సంతోషాన్నిచ్చిందని, అన్నామలై ట్వీట్ చేశారు. తమిళనాడులో కమలం తప్పకుండా వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో దీని కోసం ఆమె ఎంతో కష్టపడ్డారన్న ఆయన, ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ అభివృద్ధికి స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయన్నారు. ఇందుకు తమిళిసై రెస్పాండ్ అయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్బుతంబి అన్నామలైని కలవడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో రాసుకొచ్చారు.