ఉల్లి ధరలతో ఢిల్లీ ప్రభుత్వం పోయింది, మద్యం ధరలతో ఏపీలో జగన్ ఓడాడు
కేంద్రానికి రాష్ట్రం అవసరం ఎంతో ఉందన్న ఉండవల్లి
ఏపీలో ఫలితాల వల్లే, ఢిల్లీలో మోదీ ప్రధాని అయ్యాడు
ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు తోటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. బిజెపి పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేకపోవచ్చన్నారు. ఓటమి పొత్తు లేకపోతే ప్రధాని మోదీకే నష్టమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావలసినవి రాబట్టాలనన్నారు. మీరు ఏమి చెప్పితే అదే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ సాధించాలని చెప్పారు. 11 స్థానాలు గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలన్నారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయన్నారు. కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చిన, జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన… ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారు. ఉల్లి ధరలు పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందని, రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదల వల్లే వైసీపీ ఓడిందని చెప్పారు.
