Home Page SliderTelangana

కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాసేపటి క్రితం ఈడీ కేసు నమోదయ్యింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభలో మాట్లాడుతూ గొర్రెల స్కాంలో కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదయ్యిందని, కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని, నిజమైన లబ్దిదారులకు కాకుండా ఇతరులకు గొర్రెలు పంపిణీ అయ్యాయని, ప్రభుత్వ సొమ్ము అక్రమంగా తరలి పోయిందని ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్టు చేశారు. కేసీఆర్ మాత్రమే కాక కేటీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డిలకు కూడ ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యాఖ్యానించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు.