మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ నేత సత్యకుమార్
బీజేపీ నేత సత్యకుమార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీలో కీలకంగా మారారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్, బీజేపీ పెద్దల ఆశీస్సులు పొందారు. తాజాగా ఆయనకు చంద్రబాబు కేబినెట్లో అవకాశం లభించింది. ధర్మవరం నియోజకవర్గం నుంచి అనూహ్యంగా విజయం సాధించిన సత్యకుమార్, బీజేపీలో ఏకైక మంత్రిగా ఉన్నారు.
