మోదీ కేబినెట్‌లో తెలంగాణా నుంచి ఇద్దరికి ఛాన్స్
ప్రధాని మోదీ 3.0 కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్ లభించింది. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి ఆ అవకాశం లభించగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు సహాయమంత్రి అవకాశం లభించింది. ఇద్దరు నేతలు తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.