రాజీనామా చేయనున్న జగన్..అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం
ఏపీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతోంది. దీనితో వైసీపీ ఓటమిని అంగీకరించవలసిన పరిస్థితిలో పడింది. ముఖ్యమంత్రి జగన్ కాసేపటిలో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నారు. మరోపక్క టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అవుతోందని ప్రకటనలు చేస్తున్నారు టీడీపీ పార్టీ. ఇప్పటికే టీడీపీ 130 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, 3 స్థానాలలో గెలుపు సాధించింది. జనసేన పార్టీ 20 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. బీజేపీ 7 స్థానాలలో ఆధిక్యతలో ఉండడంతో టీడీపీ కూటమి 157 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నట్లయ్యింది. మరోపక్క అధికార వైసీపీ కేవలం 14 స్థానాలలో ఆధిక్యతలో ఉంది.