Andhra PradeshHome Page Slider

శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష

1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో జరిగిన ఘటనపై విశాఖ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. 10 మంది నిందితులకు 18 నెలలు జైలు శిక్ష విధించింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్షతో పాటుగా రెండున్నర లక్షల జరిమానా విధించింది. కేసులో 28 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిచ్చింది. 2019 వరకు 148 సార్లు కేసు వాయిదా అనంతరం విచారణ కొనసాగింది. ఐదుగురు దళితులను హింసించి, ఇద్దరికి శిరోముండనం చేసిన ఘనటలో విశాఖ కోర్టు తీర్పిచ్చింది.