మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై చంద్రబాబుతో జనసేన-బీజేపీ నేతల భేటీ
ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశారు. ఈ మూడు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం, సంయుక్త మేనిఫెస్టో, ఈ పార్టీల నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు.


