Andhra PradeshHome Page Slider

జగన్‌కు ఇక చాలయ్యా నీ సేవలు అని చెప్పండి: సీబీఎన్

ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరకుల ధరలను పెంచారు. 46 రోజులే ఉంది.. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉంది. రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిశాయి. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మాకు మద్దతివ్వండి అని కోరారు.