కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న విజయసాయిరెడ్డి
ఏపీ: ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కుప్పం ఇప్పుడు టీడీపీకి కంచుకోట కాదు. చంద్రబాబు ఓట్ల శాతం తగ్గిపోతోంది. 1999లో 74 శాతం ఉండగా, 2004లో 70 శాతం, 2009లో 61.9 శాతం, 2019లో 55 శాతానికి పడిపోయింది. టీడీపీ మాటలు మాత్రమే చెబుతుంది తప్ప చేతలు శూన్యం అని ప్రజలు తెలుసుకున్నారు. కుప్పం నుండే వైసీపీ విజయప్రస్థానం ప్రారంభం కాబోతోంది అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.