ఐపీఎల్ బెట్టింగ్‌ల కోసం భర్త కోటి అప్పులు, భార్య ఆత్మహత్య
దర్శన్ బాబు ఒక ఇంజనీర్, క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ అలవాటుగా చేసుకున్నాడు. 2021 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్‌లపై పందాలు వేస్తూనే ఉన్నాడు. బెట్టింగ్‌లో ఓడిపోయిన వెంటనే అప్పులు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. చేతిలో పైసలు లేనప్పుడు, బెట్టింగ్ చేయడం కోసం డబ్బు అప్పుగా తీసుకునేవాడు. అప్పులిచ్చిన వారి వేధింపులతో విసిగిపోయిన 23 ఏళ్ల భార్య ఆత్మహత్యకు పాల్పడింది. రంజిత మార్చి 18న కర్ణాటకలోని చిత్రదుర్గలోని తన ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యుల ప్రకారం, దర్శన్ ₹ 1 కోటికి పైగా అప్పులు చేసిన్టుట తెలుస్తోంది. హొసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2021-2023 వరకు IPL బెట్టింగ్ వలలో చిక్కుకున్నాడు.

ఇలా బెట్టింగ్ కోల్పోవడంతో కుటుంబంలో చిచ్చురేపింది. డబ్బును పోగొట్టుకున్న తర్వాత పందెం కాసేందుకు కోటిన్నరకు పైగా రుణం తీసుకున్నాడని ఆరోపించారు. కోటి తిరిగి చెల్లంచినా, ఇంకా ₹ 84 లక్షల రుణం చెల్లించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. రంజిత దర్శన్‌ను 2020లో వివాహం చేసుకుంది. దర్శన్ బెట్టింగ్‌లో పాల్గొందన్న నిజాన్ని 2021లో ఆమె ఆలస్యంగా గ్రహించిందని ఆమె తండ్రి వెంకటేష్ పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా రంజిత తండ్రి పేర్కొన్నాడు. త్వరగా డబ్బులు ఇప్పిస్తానని తన అల్లుడు… బెట్టింగ్‌కు పాల్పడతాడని తెలిపాడు. దర్శన్‌కు ముందు అసలు బెట్టింగ్ అంటే ఇష్టం ఉండేది కాదని… కానీధనవంతులు కావడానికి ఇది సులభమైన మార్గమని బలవంతం చేశారు. బెట్టింగ్ అప్పుల కోసం, ఖాళీ చెక్కులిచ్చేవాడన్నారు. పోలీసుల విచారణలో సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. తాను ఎదుర్కొన్న వేధింపులను ఆమె వివరించింది. దర్శన్, రంజిత దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.