మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్
మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత ఈటల రాజేందర్ ను పార్టీ ఖరారు చేసింది. మొదట్నుంచి అనుకుంటున్నట్టుగా ఈటలకు బీజేపీ అవకాశం ఇచ్చింది. బలమైన అభ్యర్థిగా పార్టీ ఈటలను భావించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ విజయ సంకల్ప యాత్ర ద్వారా తెలంగాణ అంతటా ఈటల ప్రచారం నిర్వహిస్తున్నారు.