195 అభ్యర్థులతో బీజేపీ లోక్ సభ అభ్యర్థులు తొలి జాబితా విడుదల
195 అభ్యర్థులతో బీజేపీ లోక్ సభ అభ్యర్థులు తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం అభ్యర్థుల్లో 57 మంది ఓబీసీ, 27 మంది ఎస్సీ అభ్యర్థులకు తొలి విడతలో అవకాశం కల్పించారు. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనున్నారు. 47 మంది అభ్యర్థులు 50 ఏళ్లలోపు వయసున్నవారు. 28 మంది మహిళలు, 47 మంది యువతకు ఈసారి ఎన్నికల్లో పోటీకి పార్టీ అవకాశం కల్పిస్తోంది. ఇక తెలంగాణలో 9 సీట్లను పార్టీ ప్రకటించింది.