Home Page SliderTelangana

డబుల్ స్పీడ్‌తో తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తాం.. రేవంత్‌కి కేసీఆర్ వార్నింగ్

ఒక రోజు ఏడ్చిన తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు పండించిందన్నారు కేసీఆర్. నల్గొండ జంగ్ సైరన్ కార్యక్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు బంధు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని, రైతు బంధు ఇవ్వకుండా రైతులను చెప్పుతో కొడతారా అంటూ మంత్రులపై కేసీఆర్ మండిపడ్డారు. పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయని… రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయని… గట్టిగా ఉంటాయని ఒక్క దెబ్బతో మూడు పళ్లు ఊసిపోతాయన్నారు. ప్రజలను గౌరవించే పద్దతి ఇదేనా అంటూ రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను నల్గొండలో దిగనవ్వరా.. కేసీఆర్ ను సంపుతారా.. కేసీఆర్ ను సంపి మీరుంటారా.. ఇది పద్దతేనా అంటూ మండిపడ్డారు.

పాలన చేతగాకుంటే తమను చూసి నేర్చుకోవాలన్నారు. కేసీఆర్ కంటే మంచిగా చేసి చూపించాలని కేసీఆర్ సవాల్ విసిరారు. పాలమూరు పూర్తి చేయాలి దాని గురించి మాట్లాడటం లేదని.. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఉద్దేశం లేదని… మంచినీళ్లు ఇవ్వడం లేదని.. ఇవన్నీ మాయం చేసి.. బలాదూర్ తిరుగుదామనుకుంటున్నారా అంటూ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. గోదావరి ఉపనది ప్రాణహిత నదిలోకి 5 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయని.. వాటిని ఎత్తిపోసి రైతులకు నీళ్లివ్వాలన్నారు కేసీఆర్. మేడిగడ్డ.. బొందలగడ్డ… ఆ గడ్డ ఈ గడ్డ పోవడం ఎందుకన్నారు.. అసెంబ్లీ అయ్యాక మేడిగడ్డ బీఆర్ఎస్ నాయకులే వస్తామన్నారు. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలన్నారు కేసీఆర్.

కేసీఆర్ ను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో రైతుల పొలాలు ఎండబెడుతున్నారని ధ్వజమెత్తారు కేసీఆర్. మేడిగడ్డలో 250 పిల్లర్లుంటాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆటబొమ్మ కాదని… రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన… మేడిగడ్డ పోతాం.. బొందల గడ్డ పోతామని చెప్పడం గొప్ప కాదన్నారు. డబుల్ స్పీడ్ తో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు కేసీఆర్. అప్పుడు మేం కూడా ఇలాగే మాట్లాడాలా అన్నారు. అహంకారం తోటి, దుర్మార్గమైన విధానంతోటి ఏం చేస్తారన్నారు. అడిగే సంస్కారం ఉండొద్దా అంటూ మండిపడ్డారు కేసీఆర్… ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనన్నారు కేసీఆర్..