జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ను “జార్ఖండ్ టైగర్” అని ఎందుకు పిలుస్తారు?
ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అవినీతి కేసు దర్యాప్తులో భాగంగా హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడానికి చంపై సోరెన్‌కు 10 రోజుల సమయం ఉన్నప్పటికీ ఆయన సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని భావిస్తున్నారు.

1) జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో చంపై సోరెన్ కీలక పాత్ర పోషించడం వల్ల ఆయనను పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు “జార్ఖండ్ టైగర్” అని కూడా పిలుస్తారు.
2) 1990ల ప్రారంభంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) చీఫ్, హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి పనిచేశాడు.
3) 1991లో స్వతంత్ర అభ్యర్థిగా ఉప ఎన్నికలో సరైకేలా స్థానం నుంచి గెలిచిన తర్వాత చంపై సోరెన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది.
4) ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన చంపై సోరెన్‌కు చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు, తండ్రి సిమల్ సోరెన్‌తో కలిసి పొలాల్లో పనిచేసేవాడు.
5) సెప్టెంబర్ 2010 మరియు జనవరి 2013 మధ్య అర్జున్ ముండా నేతృత్వంలోని BJP ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 2019లో హేమంత్ సోరెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంపై సోరెన్ ఆహార, పౌర సరఫరాలు, రవాణా మంత్రి అయ్యారు.