ఏపీలో మారుతున్న పరిణామాలు…జనసేనలోకి ముద్రగడ
టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. వ్యక్తిగతంగా తాను ముద్రగడతో సమావేశమయ్యానన్నారు జ్యోతుల నెహ్రూ.. వచ్చే ఎన్నికల్లో తనకు ముద్రగడ పూర్తి సహకారం అందిస్తామన్నారని ఆయన వివరించారు. ఏ పార్టీలో చేరాలన్నదానిపై ముద్రగడ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారాయన. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ముద్రగడ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు జ్యోతుల నెహ్రూ. ఒకవేల టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే.. ముద్రగడతో మరోసారి సమావేశమవుతానన్నారు.