Andhra PradeshHome Page Slider

అసెంబ్లీ ఎన్నికలకుముందు వైసీపీ-టీడీపీ మరో యుద్ధం

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలి వైసీపీ ఫిర్యాదు చేస్తే… టీడీపీ సైతం అదే పంథాను అనుసరిస్తోంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న నేతలపై సైకిల్ పార్టీ, ఫ్యాన్ పార్టీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతిస్తున్నవారిపై వైసీపీ అనర్హత అస్త్రంతో దూకుడు పెంచాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలన్న లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది.

వైసీపీ నేతలపై అనర్హత వేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ఆ పార్టీ కోరింది. ఉమ్మడి నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నుంచి గెలిచి, వైసీపీకి మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ ఉమ్మడి గుంటూరుకు చెందిన ఉండవల్లి శ్రీదేవితో సహా ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విప్ ధిక్కరించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల వ్యవహారం అలా ఉంటే… వైసీపీ ఎన్నుకున్న ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య టీడీపీ గూటికి చేరగా, వంశీకృష్ణ యాదవ్ జనసేన గూటికి చేరారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ తాజాగా వారిని అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఓవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ భావిస్తుంటే.. టీడీపీ సైతం అదే విధంగా ముందుకు సాగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని స్పీకర్ ను ఆ పార్టీ కోరనుంది. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌, మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీమారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరనుంది.