సొంత నిర్ణయాలుండవ్ కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా-వైఎస్ షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా సంతోషిస్తున్నానన్నారు వైఎస్ షర్మిల . ఈ రోజు నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇకపై కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు చాలా సంతోషంగా, కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగిందన్నారు. వైఎస్సార్ బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారన్నారు. చనిపోయే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ చనిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతుందంటే వైఎస్సార్ కు ఎంతో గర్వకారణమన్నారు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందన్నారు.

ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిస్తూ, కలుపుకొనిపోతూ ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో ప్రజలందరికీ న్యాయం చేస్తోందన్న విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్సార్ లక్ష్యం కోసం షర్మిల పనిచేస్తోందన్నారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గుర్తించి, గౌరవించి వారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అందుకే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా అది నెరవేర్చుతానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నారు.