Home Page SliderNational

ప్రధాని మోడీతో CM రేవంత్ సా.4 గంటలకు భేటీ..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీతో వారు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి  విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్లు సమాచారం. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగులో ఉన్నాయి. కేంద్రం నుంచి ఈ ఏడాది గ్రాంట్ల కింద రూ.43 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేసినా ఇంతవరకు రూ.5 వేల కోట్ల వరకే వచ్చాయి. మిగతా నిధులను విడుదల చేయాల్సి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఈ ఏడాదికి సంబంధించినవి ఇంకా రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలి అని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం.