సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం
ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్ టీమ్ రికార్డు సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కూడా గెలిచి 2-1 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది మొదటి నుండీ జోరుమీదున్న టీమిండియా సునాయాసంగా ఈ రికార్డు సాధించింది. ఈ సంవత్సరం వన్డేలలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో రెండవస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా మాత్రమే 2003 వ సంవత్సరంలో 30 వన్డేలలో గెలిచి ఈ రికార్డులో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు భారత్ ఈ కోవలో రెండో స్థానానికి చేరింది. 2000 సంవత్సరంలో సౌతాఫ్రికా 25 మ్యాచ్‌లు గెలిచి మూడవస్థానంలో చేరింది.