Home Page SliderNational

రోహిత్ కెప్టెన్సీపై MI స్పెషల్ ట్వీట్

రోహిత్ శర్మ ఇన్నాళ్లు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్‌కు సారధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే నిన్నటితో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ కథ ముగిసింది. కాగా రోహిత్ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యాను నియమిస్తున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం గుజరాత్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న హార్థిక్ పాండ్యాను భారీ మొత్తం వెచ్చించి ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్ దక్కించుకుంది. అంతేకాకుండా హర్థిక్‌కు కెప్టెన్ బాధ్యతలను కూడా కట్టబెట్టేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబయి ఇండియన్స్ స్పెషల్ ట్వీట్ చేసింది. “రోహిత్ నువ్వు 2013లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించావు.అప్పుడు నువ్వు మేనేజ్‌మెంట్‌ను ఒకటే అడిగావు. గెలుపైనా..ఓటమైనా సరే నవ్వుతూ ఉండాలి అని చెప్పావు.పదేళ్ల కెప్టెన్సీలో 6సార్లు(5సార్లు ఐపీఎల్ విజేత,ఒకసారి ఛాంపియన్ లీగ్)సాధించావు.దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావు. ధన్యవాదాలు కెప్టెన్ రోహిత్ శర్మ” అని ట్వీట్ చేసింది.