Home Page SliderTelangana

మార్చి 1 నుండి ఇంటర్ బోర్డు పరీక్షలు! ప్రతిపాదనలు సిద్ధం..

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుండి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో టైంటేబుల్‌ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్‌ను, జవాబు పత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈసారి జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ కళాశాలలు ప్రారంభం కావడంతో కనీసం మార్చి 1వ తేదీ నుండి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌ ఉంటాయి.