భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇదే పరిష్కారం..ఇన్ఫోసిస్ చైర్మన్
భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలంటే దేశంలోని యువత వారానికి 70 గంటల పాటు కష్టపడి పనిచేయడమే మార్గమని ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చలు జరిగాయి. సంపన్న దేశాలైన అమెరికా, యూరోపియన్ దేశాలలో ఉద్యోగులు వారానికి ఐదురోజులే కదా పని చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. వివిధ పారిశ్రామిక వేత్తలు, కంపెనీల సీఈవోలు కూడా భిన్నమైన స్పందనలు వెలిబుచ్చారు. కానీ మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు నారాయణ మూర్తి. పేదరికం నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం కష్టపడి పనిచేయడమే అన్నారు. తాము 40 ఏళ్లుగా ఈ నియమాన్నే పాటించానని వారానికి 70 గంటల పైనే, ఆరు రోజుల పాటు పని చేసేవాడినని వెల్లడించారు. ది రికార్డ్ అనే పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ, ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువన్నారు. యువత మరిన్ని గంటలు శ్రమించాలని పేర్కొన్నారు.