అభివృద్ధితో కూడిన సాంస్కృతిక వారసత్వ సంపద భారత్‌లోనే సాధ్యం.. అమిత్ షా
దేశ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడుకోవడం, దీనితో పాటు అభివృద్ధిని సాధించడం భారత్‌కు మాత్రమే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దిల్లీలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 69వ జాతీయ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ ఈనాడు ఆ కల సాకారమయ్యిందని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది కేవలం కెరీర్ కోసమే కాక, దేశ నిర్మాణానికి, అభివృద్ధికి కూడా బాటలు వేస్తుందని, దేశ యువత బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. పలు సమస్యల పరిష్కారం కోసం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్నారు. అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసిందన్నారు.

