టాటా గ్రూప్ నుండి ఐఫోన్ ప్లాంట్ ఏర్పాటు
ఇప్పటికే ఒక ఐఫోన్ల తయారీ ప్లాంటును కర్ణాటకలో నెలకొల్పిన టాటా గ్రూప్ ఇప్పడు మరో కొత్త ఐఫోన్ల ప్లాంటుకు తీర్మానం చేసుకుంది. తమిళనాడులోని హోసూరులో ఈ కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాలని భావిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయాలని, దీని ద్వారా సుమారు ఏభైవేల మందికి ఉపాధి కల్పించబడుతుందని టాటా గ్రూప్ తెలియజేసింది. దీనిని రెండేళ్ల లోపే ఏర్పాటు చేద్దామని భావిస్తున్నారు. దీనిలో 20 అసెంబ్లీ లైన్లు ఉంటాయని 18 నెలల లోపే కొత్త ప్లాంటులలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. చైనా నుండి అసెంబ్లింగ్, విడి భాగాల తయారీని ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తున్నారు యాపిల్ కంపెనీ. దీనికోసం భారత్, థాయ్ లాండ్, మలేషియా దేశాలలోని భాగస్వాములతో కలిసి సప్లయ్ పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ మెటల్ కేసింగ్ తయారీ ప్లాంటు మాత్రమే టాటా గ్రూప్ చేతిలో ఉంది. ఐతే ఇప్పుడు కేవలం అసెంబ్లింగ్‌కు మాత్రమే కాకుండా, యాపిల్ ఉత్పత్తులతో 100 రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేయాలని టాటాగ్రూప్ యోచిస్తోంది.