Home Page SliderTelangana

తెలంగాణా కాంగ్రెస్ హస్తగతం అవుతున్న వేళ.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతున్న వేళ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రెండు సార్లు తెలంగాణాలో బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.తెలంగాణా ప్రజలకు రుణపడి ఉంటా.కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.తెలంగాణా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాము. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.