Home Page SliderTelangana

సాగర్ డ్యామ్‌ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారన్న: గుత్తా

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు సాగర్ డ్యామ్‌ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతోందని గుత్తా ధీమాగా చెప్పారు. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం అవుతారు.