Home Page SliderTelangana

కుటుంబ పాలనకు చరమగీతం పాడుతూ ఓటు వేయండి: లక్ష్మణ్

నీలగిరి: బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రజలను కోరారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీ అనంతరం పెద్దగడియారం చౌరస్తాలో ఆయన మాట్లాడారు. కుటుంబపాలనకు చరమగీతం పాడాలంటే బీజేపీకి ఓటేసి, పోరాటం చేస్తున్న నాయకుల తరపున నిలవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను నడిపేది ఎంఐఎం పార్టీయేనని ఆరోపించారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ నల్గొండ ఆర్డీఓ ఆఫీస్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించారు.