Home Page SliderTelangana

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించిన బీజేపీ చీఫ్

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రాజకీయాల్లో ఎవరికి నచ్చిన నిర్ణయం వారు తీసుకుంటారన్నారు. పార్టీ మారే సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ ప్రత్యామ్నాయం కాదన్న వ్యాఖ్యలు సరికావన్నారు. కోమటిరెడ్డి అనుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఆల్టర్నేటివ్ కాకుండా పోదన్నారు.