గులాబీ బాస్ గజగజ… కేసీఆర్‌కు ఆ రెండు సీట్ల టెన్షన్
సిద్ధిపేటలో అల్లుడు గెలుస్తాడా?
సిరిసిల్లలో కొడుకు గెలుస్తాడా?
ఏమో సర్వేల టెన్షన్‌లో బిగ్‌బాస్
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు ఎదురుగాలి
సొంతిల్లు చక్కబెట్టుకునే వ్యూహం
కేసీఆర్‌కు భయం పట్టుకుందా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి ఖాయం అంటూ సర్వేలు ఒక్కటి తర్వాత ఒకటి విడుదల ఉండటంతో గులాబీ బాస్ గుండెల్లో మంటలు రేపుతున్నాయి. మళ్లీ గెలిచి హాట్రిక్ విజయాలతో రికార్డు బద్ధలు కొట్టాలని భావిస్తున్న కేసీఆర్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా సీన్ మారుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తిరుగులేదని భావించాలనుకుంటున్నప్పటికీ… పరిస్థితులు అలా కన్పించడం లేదు. తెలంగాణ ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెప్పేలా పరిస్థితులు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈసారి ఓటర్లు కర్రుగాల్చి వాతపెట్టేలా ఉన్నట్టుగా సీన్ కన్పిస్తోంది. కేసీఆర్ ప్రచారం చేస్తున్న సభలు తీరుతెన్నులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తనయుడు కేటీఆర్ గెలుస్తాడా లేడా అన్న చర్చ తాజాగా విన్పిస్తోంది. తాజాగా రాష్ట్రంలోని పలు సీట్లలో ప్రచారం చేయాల్సిన సీఎం కేసీఆర్ ముందుగా సిరిసిల్ల, సిద్దిపేటల్లో పర్యటించడంతో అసలు మర్మం ఏంటో తెలిసిపోతోంది. వాస్తవానికి 2018 ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి భారీ ఆధిక్యంతో విజయంతో సాధించారు. 2009 నుంచి కేటీఆర్ ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. తొలిత కేవలం 171 ఓట్లతో కేటీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన 2014, 2018 ఎన్నికల్లోనూ కేటీఆర్ అనూహ్య విజయాలను సాధించారు. ఒక్కొక్క ఎన్నికలో మెజార్టీని పెంచుకుంటూ పోయారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోండటంతో కేటీఆర్ పరిస్థితేంటన్న టెన్షన్ గులాబీబాస్‌లో కన్పిస్తోంది. కేటీఆర్ గెలుపుపై అనవసరమైన అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో కేసీఆర్ సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి ముందుగానే వచ్చారు.

ఓవైపు సిరిసిల్ల టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న గులాబీ బాస్, తన సొంత ఇలాకా సిద్దిపేటలోనూ ప్రచారం చేయడంతో నాయకుల్లో ఆశ్చర్యం కలుగుతోంది. కేసీఆర్ ఎందుకు సిద్దిపేటలో ప్రచారం చేస్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సిద్దిపేను దశాబ్దాలుగా కంచుకోటగా కేసీఆర్ ఫ్యామిలీ మార్చేసుకుంది. గత ఎన్నికల్లో హరీష్ రావు ఇక్కడ్నుంచి లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. కానీ రాను రాను అక్కడి ప్రజల్లోనూ ప్రతికూలత కన్పిస్తున్నట్టు గులాబీ బాస్ భావిస్తున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ గతానికి మించి గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండటంతో ఈసారి గులాబీ పార్టీకి టెన్షన్ ఎక్కువవుతోంది. దీంతో సిద్దిపేటలో సభ నిర్వహించి… హరీష్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. గతంలోలా హరీష్ రావు విజయం నల్లేరుపై నడకేం కాదన్న భావన పార్టీ నేతల్లో కన్పిస్తోంది. ఇప్పటికే హరీష్ సిద్దిపేట నుంచి ఆరు సార్లు గెలిచారు. దీంతో సిద్దిపేటలో హరీష్ రావుకు ఎదురుగాలి వీస్తుందా అన్న టెన్షన్ గులాబీ పార్టీ ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై హరీష్ లో దీమా ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలో భావిస్తున్నాయి. అటు సిద్దిపేట, ఇటు సిరిసిల్లలో… అల్లుడు, కొడుకు భారీ మెజార్టీతో విజయం సాధిస్తే తనకు పరపతి పెరుగుతుందని, తేడా వస్తే అసలుకే ఎసరని కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు.

