Andhra PradeshNationalNews

ఓట్ల కోసమే కేసీఆర్ దళితబంధు కహానీలు

రాష్ట్రంలోని దళితులందరికీ పథకం అందేదెన్నడు?
తెలంగాణలో 17 లక్షల మంది ఉన్నారని అంచనా
17 వేల కోట్ల బడ్జెట్ పెట్టారు. కేటాయింపులు సున్నా.!
ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే పథకం ఉండదేమోనన్న టెన్షన్

దళిత బంధు తెలంగాణ జనోద్ధరణ కోసం ప్రవేశపెట్టిన పథకంగా సీఎం కేసీఆర్ గొప్పలు చెబుతూ వచ్చారు. దళిత బంధు కోసం గత ఏడాది బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఒక్క పైసా విదల్చలేదు. ఖర్చూ చేయలేదు. కానీ తాను దళిత జాతి ఉద్దరిస్తానని, దళితుల కోసమే పుట్టానని కేసీఆర్ కలరింగ్ ఇస్తాడు. కానీ చెప్పేదొకటి. చేసేది మరొకటి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు… దళితబంధు తమకు రాకుండా పోతుందా… దక్కకుండా పోతుందా? అన్న భావన ఎంతో దీమాతో ఉండేవారు. కేసీఆర్ కనీసం ఎన్నికల సమయంలోనైనా తమకు దళితబంధు దక్కేలా చేస్తాడని చాలామంది అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగారు. నేటికీ తిరుగుతున్నారు. పథకం తప్పనిసరిగా తమకు వస్తుందని ఆశతో కొందరు కాలం గడుపుతున్నారు.

మొదటి విడత దళితబంధు హుజురాబాద్‌లో అందించిన కేసీఆర్, ఆ తర్వాత పక్కనబెట్టేశారు. వాస్తవానికి భారతీయ రాష్ట్ర సమితి అంటూ దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని పార్టీ పేరు మార్చుకున్న కేసీఆర్ పథకం గురించి ఎన్నో కథలు చెప్పారు. దేశంలో ఏటా 25 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందిస్తామంటూ ఖమ్మం సభ సాక్షిగా ప్రకటించారు. కానీ ఇదంతా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. వాస్తవంలో మాత్రం అమలు కానే కాలేదు. కానీ తాను దళిత జాతికి అన్నీ చేస్తున్నానని.. వారి పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఘనంగా ప్రకటించుకుంటారు. అసలు దళిత బంధు ఎంతవరకు వచ్చింది వచ్చే రోజుల్లో ఉంటుందా? ఉండదా? అన్నది విషయాలను ఇంతవరకు కేసీఆర్ చెప్పనే చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రస్థావనే లేదు. కాబట్టి వచ్చే రోజుల్లో దళితబంధు డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని తొక్కిపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఆ పథకం గురించి ఏం చెప్పలేదని… చేతులు దులుపుకునేందుకు అవకాశం కూడా కేసీఆర్‌కు ఉంది. అంటే దళిత బంధువు అన్నది, ఇప్పుడక్కర్లేదని కూడా కేసీఆర్ చెప్పొచ్చు. నాడు అవసరమనిపించింది ప్రవేశపెట్టాం.. ఇప్పుడు అక్కర్లేదనిపించింది కాబట్టి దళితబంధు ఇవ్వబోనని చెప్పేందుకు వెసులుబాటు తీసుకుంటున్నాడు.

దళిత బంధు ప్రవేశపెట్టి నేటికీ సుమారుగా రెండేళ్లు దాటింది సరిగ్గా చెప్పాలంటే 26 నెలలు గడిచిపోయాయి. ఈ పథకం కోసం కేసీఆర్ చేసిన ప్రచారం ఇంతా అంతా కాదు. ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 38323 మందికి దళితబంధు పథకం అందించారు కానీ ఇది గ్రౌండ్లో చూస్తే కేవలం పాతికవేల మందికి మాత్రమే పథకం అందింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం దళితబంధు పథకం కోసం 17700 కోట్ల రూపాయలు ప్రకటించింది. అంటే సుమారుగా ఎంతో మంది లబ్ధిదారులకు పథకాన్ని అందించే అవకాశం ఉంది. కానీ పథకానికి మాత్రం రూపాయి కూడా విధించలేదు. వాస్తవానికి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున పథకాన్ని 1,29,800 మందికి వర్తింప చేస్తామని కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం జీరో. గుండు సున్నా. దళితబంధు వస్తుందని చాలామంది దళితులు, నిరుపేదలు ఎమ్మెల్యేలకు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారందరికీ తెలియదు. కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దళితబంధు ఊసేత్తరని ఎన్నికల సమయంలోనే దళిత బంధు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేసిఆర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దళితబంధు ఇస్తాడంటే నమ్మేది ఎవరు? ఇదే మాట సామాన్య జనంలో వినిపిస్తోంది.

కేసీఆర్ మాటలన్నీ నీటి మూటలేనని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత జాతికి అది చేస్తా ఇది చేస్తా అలా చేస్తా ఎలా చేస్తా అంటూ కబుర్లు చెప్పే కేసిఆర్ వాస్తవంలో మాత్రం ఎలాంటి మేలు చేయకపోవడాన్ని మనం చూడాలి. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ 2021 జూలైలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించాడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు డబ్బున్న వాళ్ళు వీళ్ళు అని చూడకుండా అందరికీ కేటాయించాడు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలవడం కేసీఆర్‌కు అంత ముఖ్యం. ఈటల రాజేందర్ తనపై తిరుగుబాటు ప్రకటించడంతో వచ్చే రోజుల్లో మరికొన్ని తిరుగుబాట్లు లేకుండా ఉండటం కోసం చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలన్న ఉద్దేశంతో రాజేందర్ ను దెబ్బ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో హుజురాబాద్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించాడు కేసీఆర్. కానీ అది హుజురాబాద్‌కు మాత్రమే పరిమితం అయిపోయింది.

సొంత దత్తత గ్రామమైన వాసాలలో 75 మందికి పథకాన్ని అందించారు. ఆ తర్వాత నాలుగు దశల్లో ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాలతోపాటుగా, ఎస్సీ నియోజకవర్గాలైన మధిరలో 100 కోట్ల చొప్పున కేటాయించారు. తుంగతుర్తిలోని తిరుమలగిరి మండలానికి 50 కోట్లు, అచ్చంపేటలోని చారగొండ మండలానికి 50 కోట్లు, నిజాంసాగర్ మండలానికి 50 కోట్లు చొప్పున ఆయా జిల్లా కలెక్టర్ అకౌంట్లో ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తంగా, 48 మందికి పథకాన్ని అందించింది. తర్వాత పథకం వస్తుందా రాదా అన్న క్లారిటీ లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దళితులు దళితబంధు పథకం తమకు ఎప్పుడు అందిస్తారన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నాగనే మనం చూడాల్సి ఉంటుంది.