Home Page SliderInternational

విజృంభించిన భారత్ బౌలర్స్..191 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్

అహ్మదాబాద్ మోదీ స్టేడియం వేదికగా ఈ రోజు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా ఇవాళ మధ్యహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు చెలరేగారు. కాగా వారు పాకిస్తాన్ జట్టును 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇప్పుడు  టీమిండియా లక్ష్య ఛేధన 192 పరుగులు మాత్రమే.ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే టీమిండియా పాక్‌పై విజయం సాధించినట్లే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు బుమ్రా2,సిరాజ్ 2,కుల్‌దీప్ యాదవ్ 2,హార్థిక్ 2,రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు అబ్దుల్లా 20,ఇమామ్ ఉల్ హక్ 36,బాబర్ అజామ్ 50,రిజ్వాన్ 49,షకీల్ 6,ఇఫ్తికార్ 4,షాబాద్ 2,నవాజ్4,హసన్ అలీ 12 పరుగులు చేశారు.