Andhra PradeshHome Page Slider

2 శాతం వాటా అమ్ముకున్నా 400 కోట్లు వస్తాయ్.. నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారన్నారు ఆయన భార్య నారా భువనేశ్వరి. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని ఆమె అన్నారు. తనే ఒక సంస్థను నడుపుతున్నానన్న భువనేశ్వరి.. ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్ముకున్నా.. 400 కోట్ల రూపాయలు వస్తాయన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారని… ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసునన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేలేదన్న భువనేశ్వరి… ప్రజలను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నదే ఆయన తపన అని చెప్పారు.