ఈడీ విచారణకు దూరంగా ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇవాళ ఈడీ ముందు విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు. ఇవాళ తాను విచారణకు రాలేనని కవిత ఈడీకి సమాచారం అందించారు. ఈడీ నోటీసులపై నిన్ననే కవిత స్పందించారు. అవి ఈడీ నోటీసులు కావని, మోడీ నోటీసులంటూ దుయ్యబట్టారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు విచారించింది. భార్యకు ఆరోగ్యం సరిగాలేదని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విచారణను కోర్టు అక్టోబర్ 4కి వాయిదా వేసింది.