Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకే నా మద్దతు :పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు తన మద్దతు కొనసాగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో గొడవ జరిగినప్పుడు చంద్రబాబు తనకు మద్దతుగా నిలిచారని మనకు మద్దతుగా నిలిచిన వారికి ఎదురు మద్దతు తెలపటం సంస్కారం అని అందుకే చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు, ఎప్పుడు తన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ప్రశ్నించే గొంతులను నొక్కాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నదని అరాచక పాలన కొనసాగిస్తుందని దీనిలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు పంపించాలని తనను హైదరాబాదు నుండి తన పార్టీ ఆఫీస్‌కి రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని చెప్పారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక చర్యల వల్ల ప్రతిపక్షాల బలం పెరిగిందని చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ బలం పెరిగిందని అలాగే జనసేన బలం కూడా పెరిగిందని చెప్పారు. యువ నేత నారా లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని కలిసి పోరాడుదాం అని కష్ట సమయంలో తనకు చంద్రబాబు అండగా నిలిచారని తాను కూడా అలా మద్దతు ఇవ్వటం ధర్మం అని చెప్పారు.