Home Page SliderTelangana

సోనియా, రాహుల్‌తో నిర్మాణాత్మక చర్చలు-వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజల కోసం తాను, సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమైనట్టు షర్మిల చెప్పారు. ఉభయుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా, రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తోందని ఆమె చెప్పారు. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని షర్మిల పేర్కొన్నారు. పార్టీ విలీనం గురించి, పొత్తు గురించి ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఢిల్లీలోనే ఉంటున్నారా అన్న ప్రశ్నకు తాను హైదరాబాద్ వెళ్తున్నానని ఆమె చెప్పారు. సోనియాగాంధీతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో షర్మిల పాల్గొన్నారు.