నేటి నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నుంచి ఉమ్మడి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సభలు నిర్వహించడంతోపాటు ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించనున్నారు. ఇప్పటికే రెండు విడతలు వారాహి యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇక మూడో విడత వారాహి విజయ యాత్ర ఈనెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు విశాఖలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకుంటారని సాయంత్రం ఐదు గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద వారాహి వాహనం పై నుండి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ నెల 19 వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పర్యటిస్తారని ఆగస్టు 15న మాత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేస్తారన్నారు.

