Home Page SliderNational

మణిపూర్‌లో ఇండియాను చంపారు: కేంద్రంపై రాహుల్ నిప్పులు

మణిపూర్‌లో ఇండియాను హత్య చేశారని, ఇప్పుడు హర్యానాను తగులబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈరోజు లోక్‌సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో మాట్లాడుతూ, “భారతదేశం ఒక గొంతు, హృదయ స్వరం. మణిపూర్‌లో మీరు ఆ గొంతును చంపారు. మణిపూర్‌లో మీరు భారత మాతను హత్య చేసారు. మీరు దేశద్రోహులు.. నా తల్లి ఇక్కడ కూర్చున్నారు.. అవతలి తల్లి భారత్‌ మాతను మీరు మణిపూర్‌లో చంపారు.. అందుకే మణిపూర్‌లో ప్రధాని వెళ్లరు.. మీరు భారత మాతకు రక్షకులు కాదు.. హంతకులు”.

“ప్రధానమంత్రి మణిపూర్‌ను భారతదేశంలో భాగంగా పరిగణించనందున అక్కడికి వెళ్లలేదు. బీజేపీ మణిపూర్‌ను విభజించింది.” అంటూ ట్రెజరీ బెంచ్‌ల నుండి పెద్ద ఎత్తున నిరసనల మధ్య గాంధీ అన్నారు. ఆర్మీని పిలిపించడం ద్వారా మణిపూర్‌లో హింసను కేంద్రం అరికట్టగలదని, కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రామాయణ ఇతిహాసాన్ని ప్రస్తావిస్తూ, రావణుడిని రాముడు చంపలేదని, అతని అహంకారంతో చనిపోయాడని అన్నారు. “మీరు ప్రతిచోటా కిరోసిన్ చల్లారు, మీరు మణిపూర్‌లో నిప్పంటించారన్నారు. ఇటీవల గురుగ్రామ్ మరియు నుహ్‌లో ఆరుగురిని చంపిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ… మీరు ఇప్పుడు హర్యానాలో అదే పని చేస్తున్నారు” అని అన్నారు.

రాహుల్ క్షమాపణలు చెప్పాలని సీనియర్ మంత్రులు డిమాండ్ చేయడంతో ఈ వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు భారత్ జోడో యాత్రకు బయలుదేరినప్పుడు, ఫిట్‌నెస్‌పై తనకు నమ్మకం ఉందని, యాత్ర కష్టమని ఊహించలేదని చెప్పారు. అయితే ఈ దేశం అహంకారాన్ని సహించదని భావించానన్నారు. ఐతే కొద్ది రోజుల్లోనే తన పాత గాయం బాధించిందన్నారు. ఐతే తాను పాదయాత్రలో కలిసిన వ్యక్తుల నుండి బలం, ధైర్యాన్ని ఎలా పొందాడో వివరించాడు. వారి బాధలను, కష్టాలను చూసి చలించిపోయానన్నారు. మణిపూర్‌లో జాతి హింస కారణంగా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఇద్దరు మహిళలతో తాను జరిపిన సంభాషణలను కూడా గాంధీ వివరించారు.