తిరిగి లోక్ సభ ఎంపీగా రాహుల్ గాంధీ
మోడీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్షతో లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు తీర్పుతో ఊరట లభించింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీపై ఉన్న సస్పెన్షన్ను లోక్ సభ సెక్రటేరియట్ ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాహుల్ గాంధీ తిరిగి లోక్ సభ ఎంపీగా పార్లమెంట్లోకి అడుగుపెట్టనున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్నందున,రాహుల్ ఎంట్రీ ప్రధాన్యత సంతరించుకొంది. లోక్ సభ నిర్ణయం తర్వాతా కాంగ్రెస్ పార్టీ నేతలు బాణాసాంచ కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు దే వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.