Home Page SliderTelangana

తెలంగాణాలో ఆశావర్కర్లకు గుడ్‌న్యూస్

తెలంగాణాలో ఆశావర్కర్లకు కేసీఆర్ సర్కార్ తీపికబురు అందించింది. కాగా రాష్ట్రంలోని ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అయితే ఈ నెల నుంచే  వారి సెల్ ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు.దీనిపై తెలంగాణాలోని ఆశావర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్కాంలు ఉంటే..తెలంగాణాలో స్కీంలు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణాలోని 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాలను పెంచుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.