“పురంధేశ్వరి బీజేపీనా, టీడీపీనా”… మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా. ఆమె బీజేపీకి అధ్యక్షురాలా టీడీపీకి అధ్యక్షురాలా అంటూ కౌంటర్ వేశారు. పురంధరేశ్వరి, చంద్రబాబులాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆమె బీజేపీలో ఉంటూ టీడీపీకి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్ట్రిప్ట్ చదువుతున్నారని, పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసే మంచిపనులను చూడాలని సూచించారు. చంద్రబాబుతో పోలిస్తే జగన్ ప్రభుత్వం తక్కువ అప్పు చేసిందన్నారు. నాన్న పెట్టిన పార్టీ కోసం పురంధేశ్వరి పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో రాష్ట్రప్రభుత్వం అప్పుల గురించి ఇప్పటికే క్లియర్‌గా చెప్పిందన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లుందన్నారు. ఈ పనులు మానేసి, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధులు తీసుకువచ్చే పని చూడాలన్నారు. అంతేకాక తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై కూడా ఆమె సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు ‘నిధుల అనుసంధానం చేశారని’, ఇప్పుడు ‘నదుల అనుసంధానం’ కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవిలో 14 ఏళ్లపాటు ఉన్న చంద్రబాబు అప్పుడెందుకు నదులను అనుసంధానం చేయలేదని ప్రశ్నించారు.