రాజమండ్రి రోడ్ రైల్వే వంతెనపై రాకపోకల ఆంక్షలు
రాజమండ్రిలోని గోదావరి నదిపై గల రోడ్ రైల్వే వంతెనపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు పెడుతున్నారు. రాజమహేంద్రవరం-కొవ్వూరును కలిపే రోడ్ కం రైల్ వంతెనపై ద్విచక్రవాహనాలు, కార్లు మినహా ఇతర భారీ వాహనాలను, బస్సులు, లోడ్ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మాధవీలత ఉత్తర్వుల ప్రకారం బస్సులు, లారీల వంటి భారీ వాహనాలు గామన్ వంతెనపై వెళ్లాలంటూ సూచిస్తున్నారు. ఈ రోడ్డు చాలావరకూ రిపేర్లలో ఉంది. గడ్డర్లు, డెక్ జాయింట్లు దెబ్బతింటున్నాయని రోడ్లు, భవనాలశాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రిపేర్లకు ఎన్నిరోజులు పడుతుంది, రాకపోకల నిషేధం, ఆంక్షలు ఎన్ని రోజులు అమలు చేస్తారనే విషయంపై క్లారిటీ లేకపోవడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

