దశావతారాల నుండి ప్రాజెక్ట్ K మూవీ పేరు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సరికొత్త మూవీ ప్రాజెక్ట్ K టైటిల్ వచ్చేసింది. . ఈ చిత్రానికి దశావతారాలలో చివరిదైన ‘కల్కి’ అనే పేరు పెట్టడం ఆశ్చర్యం. ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ అనే పేరును ఖరారు చేశారు చిత్రబృందం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటించడంతో అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఈ చిత్రం టైటిల్, గ్లింప్స్‌ను అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో ప్రకటించారు.ఈ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, కమల్ హసన్, నిర్మాత అశ్వనీదత్, హీరో రానా దగ్గుబాటి సందడి చేశారు. మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తోంది ఈ చిత్రం .దీనిలో ప్రభాస్ నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో ‘వాటీజ్ ప్రాజెక్ట్ K’ అనే డైలాగ్ మాత్రమే గ్లింప్స్‌లో రిలీజ్ చేశారు. దీనితోనే అందరిలో ఉత్సుకత ఎక్కువయ్యింది. భారీ విజువల్స్, యాక్షన్ సీన్స్ అందరినీ కట్టి పడేశాయి. ప్రభాస్ లుక్స్ గ్రీకు వీరుడి తరహాలో ఉన్నాయి.