Andhra PradeshHome Page Slider

“ ఎవరికీ ఇబ్బంది లేకుండా నిరసన తెలపడం ప్రాథమిక హక్కు”: పవన్ కళ్యాణ్

ఇటీవల తిరుపతిలోని శ్రీకాళహస్తీలో నిరసన చేపడుతున్న జనసేన నాయకుడు సాయిపై మహిళా CI అంజూ యాదవ్ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాగా ఈ దుచర్యను ఖండిస్తూ.. ఆయన ఇవాళ శ్రీకాళహస్తీలో ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుని భారీ ర్యాలీ నడుమ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తన ఫిర్యాదును ఎస్పీకి అందజేశారు.  అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..ఎవరికీ ఇబ్బంది లేకుండా నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని అన్నారు. కాగా 2011లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిద్రిస్తున్న నిరసనకారులలపై దాడిని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని పవన్ గుర్తుచేశారు. జనసేన నాయకుడు సాయి  శాంతియుతంగానే నిరసన చేపట్టారని పవన్ తెలిపారు.  అయినప్పటికీ అతనిపై చేయి చేసుకున్న సీఐపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.