కిషన్ రెడ్డికి తంటా తెచ్చిన ఆషాడమాసం
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కొత్త కష్టం వచ్చింది. ఆషాడమాసం వల్ల తంటా వచ్చిపడింది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైకమాండ్ నిర్ణయంతో ఈ కొత్త బాధ్యత కూడా నిర్వహించవలసి వస్తోంది. ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన బాధ్యతనైతే చేపట్టారు కానీ అధ్యక్షుని స్థానంలో మాత్రం కూర్చోలేకపోతున్నారట. దీనికి కారణం ఆషాడమాసం కావడమే. బీజేపీ కార్యాలయానికి రావడానికే ఆయన ఇష్టపడడం లేదు. కానీ తప్పక పని ఒత్తిడి కారణంగా, కీలక సమావేశాల కోసం ఆయనకు రాక తప్పడం లేదు. ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రావడం వల్ల, ఇతర సమావేశాల వల్ల బీజేపీ కార్యాలయానికి వచ్చారు. కానీ అధ్యక్షుని ఛాంబర్ వైపు వెళ్లలేదట. అందరూ కూర్చునే సమావేశమందిరంలోనే కూర్చుంటున్నారట. శ్రావణ మాసం వచ్చిన తదుపరి మాత్రమే ఆయన ఛాంబర్లో అడుగుపెట్టే అవకాశం ఉందట. ఆషాడంలో శుభకార్యాలు మొదలు పెట్టకూడదన్న నమ్మకమే ఈ వింత సమస్యకు కారణం.