Home Page SliderNational

గెహ్లట్,పైలెట్‌ను కలిపిన రాహుల్ గాంధీ

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌పై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ కొన్నిరోజులుగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా మాటలు లేవు. అయితే రాహుల్ గాంధీ తాజాగా వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ రాజీ కుదిర్చేందుకు రాహుల్ గాంధీ సచిన్ పైలెట్‌ డిమాండ్లకు ముందుగా అంగీకారం తెలిపారు. అంతేకాకుండా మాజీ సీఎం వసుంధర రాజే అవినీతిపై దర్యాప్తు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దీంతో సీఎం గెహ్లట్‌తో కలిసి పనిచేస్తానని సచిన్ పైలెట్ తెలిపినట్లు సమాచారం.కాగా అశోక్ గెహ్లట్,సచిన్ పైలట్ మళ్లీ కలవడంతో రాజస్థాన్‌‌లోని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేేస్తున్నాయి.